బంగ్లాదేశ్‌ను అతలాకుతలం చేసిన ఫొని తుపాను ఫొని తుపాను ధాటికి బంగ్లాదేశ్ చిగురుటాకులా వణికిపోయింది. తీరం దాటే సమయానికి దాదాపు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాను వల్ల 16 మంది మృతి చెందారు. 63 మందికి పైగా గాయపడ్డారు.
భీకర గాలులకు భారీ చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే 16లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది బంగ్లా ప్రభుత్వం.
ఢాకా నుంచి వెళ్లాల్సిన 12 విమానాలను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.
శుక్రవారం భారత్‌లోని ఒడిశా వద్ద తీరందాటిన ఫొని తుపాను మరుసటి రోజు సుమారు 250 కి.మీ ప్రచండ వేగంతో బంగ్లాదేశ్ నైరుతి తీరాన్ని తాకింది. ఆదివారం సాయంత్రం నాటికి ఈ తుపాను తగ్గుముఖం పడుతుందని బంగ్లాదేశ్ వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: 'శ్రీలంక బాంబర్లకు కశ్మీర్, కేరళలో శిక్షణ!'