తెలంగాణ

telangana

ETV Bharat / international

క్రియాశీల రాజకీయాల్లోకి 'బెనజీర్​' చిన్న కుమార్తె - పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ

పాకిస్థాన్​ మాజీ ప్రధాని బెనజీర్​ భుట్టో చిన్న కుమార్తె అసీఫా భుట్టో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ అధినేత, తన సోదరుడు బిలావల్​ భుట్టో కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లగా.. ఆయన తరఫున సోమవారం జరిగిన విపక్షాల కూటమి పీడీఎం సభకు హాజరయ్యారు అసీఫా. తన సోదరుడికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

Benazir Bhutto's youngest daughter
బెనజీర్​ భుట్టో చిన్న కూతురు రాజకీయ రంగ ప్రవేశం

By

Published : Dec 1, 2020, 8:32 AM IST

పాకిస్థాన్​ దివంగత ప్రధానమంత్రి బెనజీర్​ భుట్టో చిన్న కుమార్తె అసీఫా భుట్టో జర్దారీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పాకిస్థాన్​ ప్రజాస్వామ్య ఉద్యమ కూటమి (పీడీఎం) ఆధ్వర్యంలో ముల్తాన్​లో సోమవారం నిర్వహించిన ర్యాలీ ద్వారా క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యం కోసం తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని, దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కోసం తన సోదరుడు బిలావల్​ భుట్టో చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

" మీ సోదరుడు బిలావల్​ భుట్టో జర్దారీ కరోనా వైరస్​తో పోరాడుతున్న క్రమంలో నేను మీ మధ్యకు వచ్చాను. దేశ ప్రజాస్వామ్యానికి తల్లి, తూర్పు ప్రాంతానికి కూతురైన మా తల్లి బెనజీర్​కు మద్దతు ఇచ్చినట్లే.. పీడీఎం వేదికగా బిలావల్​ భుట్టో జర్దారీకి మద్దతుగా నిలవాలి. ఇక నుంచి వేసే ప్రతి అడుగులో ఛైర్మన్​ బిలావల్​తో పాటు మీకూ మద్దతుగా ఉంటానని హామీ ఇస్తున్నా. పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ కార్యకర్తలను అరెస్ట్​ చేస్తే.. వారి చెల్లెళ్లు బయటకు వచ్చి దేశాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తారు. ప్రజలు తమ తీర్పును ఇచ్చేశారు. అధికారంలో ఉన్న వారు గద్దే దిగిపోవాల్సిన సమయం ఇదే."

- అసీఫా భుట్టో జర్దారీ, పాక్​ మాజీ ప్రధాని బెనజీర్​ భుట్టో కూతురు

ముల్తాన్​లోని ఘంట ఘర్​ చౌక్​లో సోమవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించింది పీడీఎం. ఈ సమావేశంలో జమైత్​ ఉలేమా ఈ ఇస్లాం చీఫ్​ మౌలానా ఫజ్లర్​ రెహ్మాన్​, పీఎంఎల్​ ఎన్​ ఉపాధ్యక్షులు మరియం నవాజ్​ సహా పలువురు పీడీఎం నేతలు హాజరయ్యారు.

ఇదీ చూడండి: పాక్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల జ్వాల

ABOUT THE AUTHOR

...view details