తైవాన్‌పై సైనిక దాడికి దిగేందుకు చైనా సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలు తరలించినట్లు సమాచారం. డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్సోనిక్ డీఎఫ్-17 క్షిపణుల్ని మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఫుజియాన్, గ్వాన్‌డాంగ్‌లోని రాకెట్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ స్థావరాల్నీ విస్తరించినట్లు కెనడా కేంద్రంగా పనిచేస్తున్న కన్వా డిఫెన్స్ రివ్యూ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పేర్కొంది. తూర్పు, దక్షిణ థియేటర్లలోని క్షిపణి స్థావరాల్ని గత కొన్నేళ్లలో రెండింతలకు పెంచినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తైవాన్‌పై యుద్ధానికి చైనా సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోందని అభిప్రాయపడింది. ఇటీవల తైవాన్ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాల్ని కూడా పెంచింది. ఇటీవల డ్రాగన్‌కు చెందిన 40 యుద్ధ విమానాలు ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖను దాటి వెళ్లాయి.
ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్ధతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బలగాల మోహరింపులు, సైనిక స్థావరాల విస్తరణ, జిన్‌పింగ్ ప్రకటనల్ని చూస్తే తైవాన్‌పై చైనా దాడిచేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ సిద్ధం కావాలి..
తైవాన్‌పై చైనా దాడికి సిద్ధమవుతున్న అంశాన్ని అమెరికా రక్షణ వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి. చైనా దండయాత్రకు తైవాన్ సిద్ధంగా ఉండాలని శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయాన్ సూచించారు. ఇటు భూసరిహద్దులతో పాటు, జలమార్గాల్లోనూ డ్రాగన్ సేనల్ని దీటుగా తిప్పికొట్టే వ్యూహాలతో తైవాన్ సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.
చైనా లక్ష్యమదేనా?