కరోనా పుట్టుకకు కేంద్ర బిందువుగా చెప్పుకుంటున్న చైనాలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజింగ్ అప్రమత్తమైంది. బీజింగ్‌కి పక్కనే ఉన్న రాష్ట్రాలలో కొత్త కేసులు సంఖ్య పెరుగుతుండటం ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. శుక్రవారం హిబై నగరంలో 137 కేసులు నమోదవగా మెుత్తంగా రాష్ట్రం పరిధిలో 476 కేసులను అధికారులు గుర్తించారు. అందులో 36 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారుగా తెలుస్తోంది.
చైనాలో అలర్ట్: క్రమంగా పెరుగుతోన్న కేసులు - కరోనా తాజా వార్తలు
చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
చైనాలో మళ్లీ ఆందోళన- క్రమంగా పెరుగుతోన్న కేసులు
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు బీజింగ్ ప్రతినిధులు కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చైనా ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 90 లక్షల మందికి టీకా పంపిణీ ప్రక్రియలో పాల్గొని వ్యాక్సిన్ తీసుకున్నారు.
- ఇదీ చూడండి:అమెరికాకు కిమ్ 'అణ్వాయుధ' హెచ్చరికలు