మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. ఇకపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించనుంది. ఈ మేరకు ఓ ప్రతిపాదనను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని కెబినేట్ ఆమోదించింది.
ఇకపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్షే! - Bangladesh cabinet news updates
మహిళపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. త్వరలోనే దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్.

ఆ దేశంలో అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష!
అత్యాచారానికి పాల్పడిన వారికి.. ప్రస్తుతం జీవిత ఖైదు అమల్లో ఉంది. మరణశిక్షగా మార్చుతూ.. అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆర్డినెన్స్ జారీ చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:'నేపాల్ సరిహద్దు భూములను ఆక్రమించిన చైనా'