తెలంగాణ

telangana

ETV Bharat / international

పొంగలిలో వెంట్రుక పడిందని భార్యకు గుండు గీసిన భర్త - bole head

మహిళలు ఇంటి పనులతో సతమతం అవుతుంటారు. ఆమె కూడా అంతే. ఏమరుపాటులో ఉన్నదేమో ఓ వెంట్రుక పొంగలిలో పడిపోయింది. అది కాస్తా కోపిష్ఠి భర్త పళ్లెంలోకి వెళ్లింది. అతడు రెచ్చిపోయాడు. బ్లేడుతో స్వయంగా భార్యకు గుండు గీశాడు. బంగ్లాదేశ్​లోని జాయ్​పుర్హత్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

పొంగలిలో వెంట్రుక పడిందని భార్యకు గుండు గీసిన భర్త

By

Published : Oct 8, 2019, 5:59 PM IST

పొంగలిలో వెంట్రుక పడిందని భార్యకు విచక్షణారహితంగా బ్లేడుతో గుండు గీశాడు ఓ భర్త. ఈ ఘటన బంగ్లాదేశ్​లోని జాయ్​పుర్హత్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది

జాయ్​పుర్హత్​​ జిల్లాలోని ఓ గ్రామంలో బబ్లూ మొండల్​ (35) అనే వ్యక్తికి ఉదయాన్నే అల్పాహారంగా పొంగలి వడ్డించింది భార్య. అందులో వెంట్రుక ఉండడాన్ని చూసి బబ్లూ కోపోద్రిక్తుడయ్యాడు. బ్లేడు తీసుకుని భార్యకు గుండు గీశాడు. ఈ విషయంపై గ్రామస్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
భార్యకు గుండు గీసిన బబ్లూను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

ఇదీ చూడండి : శనిగ్రహం చుట్టూ మరో 20 చందమామలు..!

ABOUT THE AUTHOR

...view details