భారత్, బంగ్లాదేశ్.. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం, ప్రేమ, శాంతిని కోరుకుంటున్నాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండో రోజు మతువా వర్గం ఆధ్యాత్మిక గురువు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం ఓరకండిలోని హరిచంద్-గురుచంద్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. అనంతరం మతువా వర్గం వారితో సమావేశమయ్యారు.
"ఈ అవకాశం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. 2015లో బంగ్లాదేశ్ వచ్చినప్పుడు ఓరకండికి రావాలనుకున్నా. అది ఇప్పుడు నిజమైంది. ఓరకండికి వచ్చిన తర్వాత.. భారత్లోని మతువా ప్రజల పొందిన అనుభూతిని నేను అనుభవిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, అస్థిరత, ఆందోళనల స్థానంలో.. స్థిరత్వం, ప్రేమ, శాంతిని భారత్, బంగ్లా చూడాలనుకుంటున్నాయి. తమ సొంత పురోగతితో ప్రపంచ పురోగతిని కోరుకుంటున్నాయి. "