బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా మైనార్టీలపై (Minorities in Bangladesh) దాడులు జరుగుతున్నాయి. కొమిల్లా జిల్లాలో దుర్గామాత పూజల వేళ మొదలైన ఈ హింసాత్మక ఘటనలు.. ఆయా ప్రాంతాలకు పాకాయి. రంగ్‌పుర్ జిల్లాలో కొందరు దుండగులు ఆదివారం అర్ధరాత్రి అక్కడి మైనార్టీలైన హిందూవర్గానికి చెందిన 20 ఇళ్లను తగలబెట్టడమే కాకుండా మరో 66 ఇళ్లను ధ్వంసం చేశారు.
మరోవైపు, ఈ దాడులను (Bangladesh Minority Attack) తీవ్రంగా ఖండిస్తూ, స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతుండటంతో.. బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.. ఆయా హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేబినెట్ కార్యదర్శి అన్వరుల్ ఇస్లాం ఈ సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. (Bangladesh Minority Attack)
అవామీ లీగ్ శాంతి ర్యాలీలు..