తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగ్లాదేశ్​ మంత్రికి 'పౌర' సెగ- భారత పర్యటన రద్దు - బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మొమెన్​ భారత పర్యటన రద్దు

బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మొమెన్​ భారత పర్యటన రద్దు చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలే కారణమని తెలుస్తోంది.

Bangladesh Foreign Minister A K Abdul Momen  cancels India visit over situation following passage of CAB
బంగ్లాదేశ్​ మంత్రికి 'పౌర' సెగ- భారత పర్యటన రద్దు

By

Published : Dec 12, 2019, 4:56 PM IST

పౌరసత్వ చట్ట సవరణపై నిరసనల నేపథ్యంలో బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మొమెన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రం 5:20 నిమిషాలకు మొమెన్​ భారత్​కు వచ్చి, మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. దిల్లీ వేదికగా జరగాల్సిన వేర్వేరు కార్యక్రమాలు సహా భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తో ద్వైపాక్షిక చర్చల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే... స్వదేశంలో తాను వేర్వేరు కార్యక్రమాలకు హాజరై తీరాల్సి ఉన్నందున భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు అబ్దుల్. జనవరిలో దిల్లీ వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:'పౌర' సెగ: రణరంగంలా అసోం- నిరసనకారుల విధ్వంసకాండ

ABOUT THE AUTHOR

...view details