పాకిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ వద్ద నిరసనలు వెల్లువెత్తాయి. ఆ దేశానికి చెందిన ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ కార్యకర్తలు బలూచిస్థాన్‌లో పాక్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించారు. బలూచ్ ప్రజలపై జరుగుతున్న అక్రమాలను అణచివేయడానికి ఐరాస తమకు సహాయం చేయాలని కోరారు.
బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం కావలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి, అక్కడి వనరులను ఉపయోగించుకోవడం ఆపాలని నిరసించారు. మోహజిర్లను పాక్ అన్యాయంగా చంపుతోందని వారిపై చేస్తున్న దాడులను మానుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.