తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్ ఆర్మీ చీఫ్​కు సౌదీలో ఘోర పరాభవం - Saudi Arabia snubs Pakistan

సౌదీ అరేబియాలో పాకిస్థాన్​కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్​ అంశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో సౌదీ నాయకత్వాన్ని బుజ్జగించే ప్రయత్నాల్లో పాక్​ విఫలమైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రియాద్​కు వెళ్లిన పాక్​ సైన్యాధిపతి జనరల్​ కమర్​ జావేద్​ బజ్వా.. ఆ దేశ రాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో భేటీ అవ్వటంలో విఫలమవటమే ఇందుకు నిదర్శనం.

Bajwa fails to meet Saudi Arabia Crown Prince
పౌక్​కు ఎదురుదెబ్బ.. సంబంధాల కొనసాగిపునకు సౌదీ నో!

By

Published : Aug 19, 2020, 1:31 PM IST

పాకిస్థాన్​పై సౌదీ అరేబియా ఇంకా గుర్రుగానే ఉన్నట్లు సమాచారం. ఇటీవల నెలకొన్న పరిస్థితులతో పాక్​తో సత్సంబంధాలు కొనసాగించేందుకు సౌదీ సుముకంగా లేనట్లు తెలుస్తోంది. సౌదీ నాయకత్వాన్ని శాంతింపజేసేందుకు రియాద్​ వెళ్లిన పాక్​ ఆర్మీ చీఫ్​ జనరల్​ కమర్​ జావేద్​ బజ్వా... సౌదీ రాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో భేటీ కాలేకపోవటమే ఇందుకు నిదర్శనం.

కశ్మీర్​ అంశంలో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. బజ్వాతో పాటు పాక్​ నిఘా విభాగం (ఐఎస్​ఐ) అధినేత జనరల్​ ఫయజ్​ హమీద్​.. సోమవారం సౌదీ అరేబియా వెళ్లారు. సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రిన్స్​ ఖలిద్​ బిన్​ సల్మాన్​, సైన్యాధినేత జనరల్​ ఫయద్​ బిన్​ సల్మాన్​ అల్​ రువాలితో భేటీ అయ్యారు. కానీ.., రాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తో భేటీ కాలేకపోయారు.

కశ్మీర్​ అంశంలో తమకు మద్దతు పలకాలని సౌదీకి లేఖ పంపింది పాకిస్థాన్​. కానీ.. అందుకు సౌదీ నిరాకరించింది. దీంతో ఓఐసీ(ఆర్గనైజేషన్​ ఆఫ్​ ఇస్లామిక్​ కోఆపరేషన్​)పై పాక్​ విదేశాంగమంత్రి మహ్మద్​ ఖురేషి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్​ 370 రద్దు చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో సౌదీకి హెచ్చరికలు పంపారు. ఖురేషీ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలు దెబ్బతిన్నాయి. పాక్​కు ఇచ్చిన 1 బిలియన్​ డాలర్ల రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని ఆదేశించింది సౌదీ.

సౌదీతో సంబంధాలు తెబ్బతినటం వల్ల పాక్​ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బజ్వా భేటీ విఫలమవటం కూడా అదే విషయాన్ని రుజవుచేస్తోంది. ఇస్లామాబాద్​కు సౌదీ చాలా సందర్భాల్లో సాయం చేసింది. 1980లో తొలి బ్యాచ్​ ఎఫ్​-16 యుద్ధ విమానాల కొనుగోలుకు సాయం చేసింది. అలాగే రెండేళ్ల క్రితం 6.2 బిలియన్​ డాలర్లు రుణం అందించింది. అందులో 3.2 బిలియన్​ డాలర్ల చమురు, మిగతా 3 బిలియన్​ డాలర్లు నగదు రూపంలో ఇచ్చింది. మూడేళ్లపాటు రుణాల చెల్లింపు నిలిపివేతకు ఇరు దేశాల మధ్య 2019, మేలో ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది దానిని పునరుద్ధరించాల్సి ఉంది. అయితే.. పాకిస్థాన్​ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సౌదీ నాయకత్వం.. ఈ సౌకర్యాన్ని నిలిపివేసింది. టర్కీ, మలేషియా, ఇరాన్​ వైపు పాకిస్థాన్​ మొగ్గు చూపటం, చైనాపై అధికంగా ఆధారపడటం సౌదీల కోపానికి కారణం అయి ఉండవచ్చు.

ఇదీ చూడండి:కశ్మీర్​పై పాక్​కు సౌదీ షాక్​- చమురు సరఫరా కట్​

ABOUT THE AUTHOR

...view details