ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి బహ్రెయిన్ అనుమతులు మంజూరు చేసింది. ఫలితంగా ఈ టీకాకు ఆమోదం తెలిపిన రెండో దేశంగా నిలిచింది. ఈ వ్యాక్సిన్‌పై అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించి, సమీక్షించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బహ్రెయిన్ ప్రకటించింది. ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి మొదట బ్రిటన్ అనుమతులు ఇచ్చింది.
ఫైజర్ టీకా వినియోగానికి మరో దేశం ఆమోదం - టీకా అత్యవసర వినియోగం
కొవిడ్ వ్యాక్సిన్ 'ఫైజర్' అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చింది బహ్రెయిన్. టీకాను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే దీనిని ఆమోదించినట్లు తెలిపింది.
ఫైజర్ టీకా వినియోగాన్ని ఆమోదించిన మరో దేశం
అమెరికన్ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థలు కలిసి ఈ ఫైజర్ టీకాను అభివృద్ధి చేశాయి. అంతకుముందు.. చైనా అభివృద్ధి చేసిన సినోఫామ్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతించింది బహ్రెయిన్.
ఇదీ చూడండి:టీకాపై భారత ప్రభుత్వంతో చర్చిస్తాం: ఫైజర్