తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆర్మేనియాతో పోరులో ఆజర్​బైజాన్​కు భారీ నష్టం - నగోర్నో కరబాఖ్​

నాగోర్నో-కరాబఖ్​పై ఆర్మేనియాతో జరుగుతున్న పోరులో అజర్​బైజాన్​ భారీగా నష్టపోతున్నట్టు కనపడుతోంది. ఇప్పటివరకు 262 డ్రోన్లు, 16 హెలికాఫ్టర్లతో పాటు 7,510మంది ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా ప్రభుత్వం నేతృత్వంలోని ఆర్మేనియా యూనిఫైడ్​ ఇన్ఫోసెంటర్​ పేర్కొంది.

Azerbaijan's casualties in Karabakh conflict escalation tops 7,500
ఆర్మేనియాతో పోరులో ఆజర్​బైజాన్​కు భారీ నష్టం

By

Published : Nov 7, 2020, 7:21 PM IST

వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆర్మేనియాతో నెలకొన్న ఉద్రిక్తతల్లో 7,500కుపైగా అజర్​బైజాన్​ దేశస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం నేతృత్వంలోని ఆర్మేనియన్​ యూనిఫైడ్​ ఇన్ఫోసెంటర్​ వెల్లడించింది.

శనివారం నాటికి మొత్తం మీద 262 డ్రోన్లు, 16హెలికాఫ్టర్లు, 25ఎయిర్​క్రాఫ్టులు, 749 వాహనలతో పాటు 7,510మందిని అజర్​బైజాన్​ కోల్పోయినట్టు ఇన్ఫోసెంటర్​ పేర్కొంది.

గత 24గంటల్లోనే 105మంది హతమైనట్టు, 13 వాహనాలు ధ్వంసమైనట్టు వెల్లడించింది ఇన్ఫోసెంటర్​.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details