భారత్ నుంచి తిరిగి రావాలునుకునే ఆస్ట్రేలియన్లపై విధించిన నిషేధాన్ని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ సమర్థించుకున్నారు. దేశ ప్రజల హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
భారత్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. 14 రోజుల పాటు భారత్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే.. జైలు శిక్షతో పాటు భారీ స్థాయిలో జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.
"ఆస్ట్రేలియాలో కరోనా మూడో దశను నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో దేశంలోని క్వారంటైన్ వ్యవస్థ బలంగా ఉంటుంది. ముఖ్య వైద్య అధికారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆస్ట్రేలియన్లను సురక్షితంగా ఉంచేందుకు ఈ నిషేధం తప్పదు."
--- స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి.