ఆస్ట్రేలియా అడవులను కొద్ది రోజుల నుంచి బుగ్గి చేస్తోన్న కార్చిచ్చు.. ఇళ్లనూ ఆహుతి చేస్తోంది. న్యూ సౌత్ వేల్స్లో అంటుకున్న దావానలం వల్ల పదుల సంఖ్యలో గృహాలు దగ్ధమయ్యాయి.
పలు ప్రాంతాల్లో భారీ నష్టం..
వాయువ్య సిడ్నీలోని గోస్పర్స్ పర్వత శ్రేణుల్లో, నగరానికి నైరుతి దిశలో ఉన్న గ్రీన్ వాటిల్ క్రీక్ ప్రాంతం, దక్షిణ తీరంలోని కుర్రోవన్ బుష్ ప్రాంతాల్లో రాజుకున్న కార్చిచ్చు వల్ల భారీగా నష్టం సంభవించింది. ఈ మంటల వల్ల నగర సమీపాన ఉన్న పలు గ్రామాలు గత మూడు రోజుల్లో నాశనమయ్యాయి.