తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కన్సర్వేటివ్స్​దే మళ్లీ అధికారం! - VOTES

గత శనివారం ముగిసిన ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇంకా స్పష్టమైన ఫలితాలు వెల్లడికాలేదు. అధికార లిబరల్​-నేషనల్​ సంకీర్ణం మెజారిటీకి అవసరమైన స్థానాల కంటే మరొకటి అధికంగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని వెల్లడించింది జాతీయ ప్రసార సంస్థ ఏబీసీ.

ఆస్ట్రేలియాలో లిబరల్​-నేషనల్​ సంకీర్ణంకు మెజార్టీ

By

Published : May 20, 2019, 8:49 AM IST

Updated : May 20, 2019, 9:38 AM IST

అధికార లిబరల్​-నేషనల్​ సంకీర్ణంకే పట్టం

ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీనే మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి స్కాట్​ మోరిసన్​ నేతృత్వంలోని లిబరల్​-నేషనల్​ సంకీర్ణం మెజారిటీ స్థానాలు గెలుచుకోనుందని జాతీయ ప్రసారదారు ఏబీసీ సర్వే వెల్లడించింది.

151 సీట్లున్న ప్రతినిధుల సభ( హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​)లో ప్రభుత్వ ఏర్పాటుకు 76 స్థానాలు అవసరం. ఇంతకంటే ఒక స్థానం ఎక్కువగా నెగ్గి.. అధికార పార్టీనే సొంతంగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు ఏబీసీ రాజకీయ విశ్లేషకులు.

సెనేట్​లో మద్దతు కోసం...

అయితే... ఎగువసభ సెనేట్​లో సంకీర్ణానికి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది ఏబీసీ. ఈ తరుణంలో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలి.

విశాల ద్వీపఖండంలో కొన్ని చోట్ల ఎన్నికల కౌంటింగ్​ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ​ ఈ వారం అనంతరం ఆస్ట్రేలియా ఎన్నికల కమిషన్.. అధికారిక వివరాలు వెల్లడించే అవకాశముంది.

మోరిసన్​కు ఇప్పుడే అతి పెద్ద సవాల్​ ఎదురుకానుంది. చాలా మంది మంత్రులు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాల్లోనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కేబినెట్​ ఏర్పాటు మోరిసన్​కు క్లిష్ట పరిస్థితుల్ని తెచ్చిపెట్టింది.

ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికలు శనివారం ముగిశాయి. అయితే... ఎగ్జిట్​పోల్స్​ అంచనాలను పటాపంచలు చేస్తూ అధికార లిబరల్​-నేషనల్​ సంకీర్ణం విజయం దాదాపు ఖాయమైంది. ఎన్నికల అనంతరం ఓటమిని అంగీకరించిన ప్రతిపక్ష నేత బిల్​ షార్టెన్ ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ లేబర్​ పార్టీ​ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.

ఇదీ చూడండి:

యుద్ధం కోరుకుంటే ఇరాన్​ కథ ముగిసినట్టే: ట్రంప్​

Last Updated : May 20, 2019, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details