చతుర్భుజ కూటమి(క్వాడ్) త్వరలో సమావేశమవుతుందని సంకేతాలు ఇచ్చారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. దీని గురించి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో చర్చించినట్లు తెలిపారు.
"క్వాడ్ దేశాల సమావేశం ఎప్పుడు జరపాలన్న విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కొన్ని వారాల క్రితమే మాట్లాడాను. గత వారమే అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తోను చర్చించాను. ద్వైపాక్షిక సమావేశమప్పుడు ప్రధాని మోదీతో , జపాన్ ప్రధానితో మాట్లాడాను. క్వాడ్ దేశాల సమావేశం ఇండో- ఫసిపిక్ ప్రాంతంలో శాంతి, సుస్థితరను నెలకొల్పడానికి కీలకం అవుతుంది. అందుకోసం నాలుగు దేశాల ఆలోచనలను పంచుకుంటాం. శాంతి కోసం పాటుపడాలన్నఆలోచనను మేం స్వాగతిస్తాం."
--స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని