ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌పై ఓ మహిళ గుడ్డుతో దాడి చేసింది. ఈ ఘటన న్యూ సౌత్‌వేల్స్‌లోని ఆల్బురిలో జరిగింది. అధికారులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
గుడ్డుతో దాడి చేసిన అనంతరం పారిపోతూ ఓ వృద్ధురాలిని నిందితురాలు ఢీకొంది. వృద్ధురాలు మార్గరేట్ బాక్స్టర్ కిందపడింది. వెంటనే స్పందించిన ప్రధాని మార్గరేట్‌కు ఆమెకు సహాయం చేశారు.
ఓటర్లతో మాట్లాడుతుండగా...
ఈ నెల 18న అస్ట్రేలియాలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోరిసన్ న్యూ సౌత్‌వేల్స్‌లో ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. ఓటర్లతో మాట్లాడుతుండగా... వెనుక నుంచి మహిళ ప్రధాని తలపై గుడ్డు కొట్టింది. పక్కనే ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. గుడ్డు పగల లేదు.
మహిళ వద్ద డజనుకుపైగా గుడ్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.