తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియా ఎన్నికల్లో అధికార పార్టీదే విజయం..!

ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో అధికార లిబరల్​ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణం విజయం సాధించింది. ఓటమి అంగీకరించిన లేబర్​పార్టీ నేత బిల్ ​షార్టెన్...ప్రధాని స్కాట్​ మారిసన్​కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆస్ట్రేలియా ఎన్నికల్లో అధికార పార్టీదే విజయం..!

By

Published : May 18, 2019, 9:37 PM IST

Updated : May 19, 2019, 6:52 AM IST

ఆస్ట్రేలియా ఎన్నికల్లో అధికార పార్టీదే విజయం..!

ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో ఎగ్జిట్​పోల్స్​​ అంచనాలను తలకిందులు చేస్తూ అధికార లిబరల్​ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మరోసారి విజయం సాధించింది. ప్రధానమంత్రి స్కాట్​ మారిసన్​ ఇది ప్రజలు తమకు అందించిన అద్భుత విజయమని ఆనందం వ్యక్తం చేశారు.

"ఆస్ట్రేలియా ఎంత మంచిది. నేను ఎప్పుడూ అద్భుతాలను విశ్వసిస్తాను."- స్కాట్​ మారిసన్​, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి

హోరాహోరీగా పోరాడిన ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ ఓటమిని అంగీకరించింది. లేబర్​పార్టీ నేత బిల్​ షార్టెన్​... ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

"లేబర్​పార్టీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టమవుతోంది. దేశ ప్రయోజనాలే ముఖ్యం. ప్రధాని స్కాట్​ మారిసన్​కు శుభాకాంక్షలు." - బిల్ షార్టెన్​, లేబర్ పార్టీ నేత

ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలోని 151 స్థానాల్లో... లిబరల్​ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణం కనీసం 73 సీట్లు, ప్రధాన ప్రతిపక్షమైన లేబర్​పార్టీ 65 సీట్లు గెలుపొందవచ్చని అంచనా.

ప్రధాని స్కాట్​ మారిసన్ నేతృత్వంలోని​ లిబరల్​-నేషనల్ సంకీర్ణ ప్రభుత్వం మరో ఆరేళ్లపాటు అధికారంలో ఉంటుంది.

ఇదీ చూడండి: మనుషుల్ని రంపాలతో కోసి... 18 సంచుల్లో నింపి!

Last Updated : May 19, 2019, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details