ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రం బల్లార్ట్ పట్టణం సమీపంలోని అడవుల్లో మంటలు చెలరేగాయి. ఎండుగడ్డి కారణంగా అగ్నికీలలు వేగంగా విస్తరిస్తున్నాయి. వందల ఎకరాల అడవితోపాటు సమీపంలోని అనేక భవనాలు, వాహనాలు దగ్ధమయ్యాయి.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు- భారీ ఆస్తి నష్టం - fire accident
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. భవనాలు, వాహనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ఘోర అగ్నిప్రమాదం
దావానలాన్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. హెలికాప్టర్లతో నీళ్లు చల్లుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
ఇదీ చూడండి :ఢాకా అగ్నిప్రమాదంలో మరో ఆరుగురు మృతి