ఆస్ట్రేలియాలోని అత్యధిక జనాభ కల్గిన విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్లోని దక్షిణ తీర ప్రాంతానికి కార్చిచ్చు విస్తరించింది. ఈ దావాగ్నికి ఇద్దరు వ్యక్తులు ఆహుతవగా... ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అధిక సంఖ్యలో ఇళ్లు దగ్ధమవగా...భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది.
న్యూ సౌత్వేల్స్లోని దక్షిణ తీర ప్రాంతంలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాలకి అనుసంధానించే ప్రిన్సెస్ రహదారి పక్క కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. దీంతో ప్రజలు భయాందోళనతో... తమ ఇళ్లలో నుంచి పక్కనే ఉన్న బీచ్ ప్రాంతంలోకి పరుగులు తీశారు. మంటలు అంటుకున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లో చిక్కుకుపోవడం వల్ల దావాగ్నికి ఆహుతయ్యారు.