కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న కఠినమైన ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నట్లు (Australia Travel ban lift) ఆస్ట్రేలియా ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి వ్యాక్సినేషన్ పూర్తైన వీసా హోల్డర్లు ఆస్ట్రేలియాకు (Australia Travel ban update) రావొచ్చని తెలిపింది. ఇందుకోసం ముందస్తు అనుమతులు పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
ఆస్ట్రేలియా థెరపెటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించిన టీకా డోసులను పూర్తిగా తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల మినహాయింపు ఉంటుంది. స్వదేశానికి రావాలనుకున్నవారికి సరైన వీసా ఉండటం తప్పనిసరి. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు కొవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. ఇది మూడు రోజుల లోపుదై ఉండాలి.
క్వారంటైన్ రూల్స్ పాటించాలి..