భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా విధించిన నిషేధంలో సడలింపు లభించింది. గతంలో భారత్ నుంచి విమానాల రాకపోకలను మే 15 వరకు నిషేధిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకొంది. ఒకవేళ ఎవరైనా వస్తే జైలుశిక్ష, జరిమానా తప్పదని ప్రధాని స్కాట్ మారిసన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఆస్ట్రేలియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన నిర్ణయంపై కొంచెం వెనక్కి తగ్గారు. భారత్‌లో చిక్కుకుపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని శుక్రవారం వెల్లడించారు.
వచ్చే వారంతో ఈ నిషేధం ముగిశాక.. భారత్ చిక్కుకున్న వారు తిరిగి వచ్చేలా విమానాలు నడపనున్నట్లు పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం 9,000 మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 900 మంది స్వదేశానికి వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్నారు.
మూడు విమానాల్లో...