తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియా లక్ష్యం- 20 లక్షల పిల్లులు! - చంపడం

ఆస్ట్రేలియాలో 'ఫెరల్'​ పిల్లులు అధికం. వీటి ఆహారపు అలవాట్లు ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అంతరించిపోతున్న 22 జాతులకు ఫెరల్​ పిల్లుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. అందుకే 2020లోగా 20 లక్షల పిల్లులను చంపాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది.

ఆస్ట్రేలియా లక్ష్యం- 20 లక్షల పిల్లులు!

By

Published : Apr 28, 2019, 3:04 PM IST

2020లోగా 20 లక్షల పిల్లులను చంపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లులపై ఆ దేశానికి ఇంత ఆగ్రహం ఎందుకని అనుకుంటున్నారా? అయితే చదివేయండి.

పిల్లుల జాతిలో 'ఫెరల్​' ఒకటి. ఈ జాతి పిల్లులు ఆస్ట్రేలియాలో అధికం. పెంపుడు పిల్లులకు వీటికి చాలా తేడా ఉంటుంది. ఈ జాతికి చెందిన పిల్లులు మనుషులకు దూరంగా ఉంటాయి.

పిల్లుల ఏరివేతకు కారణం...

ఈ పిల్లుల ఆహారపు అలవాట్లే ఆ దేశ ప్రభుత్వానికి తలనొప్పి తెస్తున్నాయి. వీటి వల్ల అంతరించిపోతున్న 34 జాతుల్లో 22 జాతులకు అపార నష్టం జరుగుతోంది. 2017లో ఆహారం కోసం ఈ పిల్లులు సుమారు 377 మిలియన్​ పక్షులు, 649 సరీసృపాలను చంపినట్టు ఓ పత్రిక కథనం వెలువరించింది.

పర్యావరణ వ్యవస్థను ఈ పిల్లులు దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం 2015 - 2020 మధ్య కాలంలో 20 లక్షల ఫెరల్​ పిల్లులను చంపడానికి నిశ్చయించింది. ఇందుకు కావాల్సిన ప్రణాళికలూ సిద్ధం చేసింది. తొలి ఏడాది 2 లక్షల 11 వేల పిల్లులను హతమార్చింది.

గతంలో పిల్లులను పట్టుకుని కాల్చి చంపేవారు. కానీ ఇప్పుడు కంగారూ మాంసం, ప్రత్యేక ఔషధాలు, విషంతో కలిపిన తిండి పదార్థాల(సాసేజ్​)ను పిల్లులకు అందిస్తున్నారు. దీనికోసం విమానాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తిన్న పిల్లులు కేవలం 15 నిమిషాల్లోనే మరణిస్తాయి.

ఇదీ చూడండి: ఐపీఎల్.. స్పిన్నర్లు కాదు పేసర్లదే హవా

ABOUT THE AUTHOR

...view details