తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు భారత్​లో వర్షాలే కారణమట!

రెండు దేశాల మధ్య దూరం 10 వేల కిలోమీటర్లు. అయినా... ఆస్ట్రేలియా అడవుల్లో మంటలు చెలరేగడానికి భారత్​లో ఎక్కువ కాలం వర్షాలు పడడమే కారణం అంటున్నారు నిపుణులు. ఎందుకలా? నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్​ చెప్పిన 'బటర్​ఫ్లై థియరీ' వంటి కారణం ఏదైనా ఉందా?

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు భారత్​లో వర్షాలే కారణమట!

By

Published : Nov 11, 2019, 1:12 PM IST

Updated : Nov 11, 2019, 6:02 PM IST

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు భారత్​లో వర్షాలే కారణమట!
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రాజుకుని లక్షల ఎకరాల అడవి బూడిదవుతోంది. ఇప్పటికే 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యేసరికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. కార్చిచ్చుకు భారత రుతుపవనాల ఆలస్య తిరోగమనం కూడా ఓ కారణమే అంటున్నారు వాతావరణ నిపుణులు.

ఎన్నడూ ఎరుగని జ్వాలలు

వేడి భూభాగం, పొడి వాతావరణం అధికంగా ఉండే ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు సాధారణమే. ఏటా వర్షాలు కురవడం కాస్త ఆలస్యమైతే వేడికి అడవుల్లో మంటలు చెలరేగుతాయి. వేసవిలో వచ్చే ఈ ఆస్ట్రేలియన్ ఫైర్ సీజన్, ఈసారి అసాధారణంగా శీతాకాలం తర్వాత ప్రారంభమైంది.

అయితే ఈసారి మాత్రం ఎన్నడూ లేనంతగా జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే 8 లక్షల 50 వేల హెక్టార్లకుపైగా అడవి దగ్ధమైంది.

అత్యవసర పరిస్థితి

కార్చిచ్చు కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. వేలాది మంది నివాసం కోల్పోయారు. దావానలం వేగంగా జనావాసాల వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో సిడ్నీ, ఉత్తరాన ఉన్న హంటర్ వ్యాలీ ప్రాంతాల్లో మంగళవారం అత్యవసర స్థితి కొనసాగుతుందని ప్రకటించింది ప్రభుత్వం. మిగిలిన రాష్ట్రాలలోనూ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.

"ప్రకృతి ప్రళయాన్ని మనం తప్పించుకోలేం. కానీ, మీరు కార్చిచ్చు సమీపంలో ఉంటే అది చాలా ప్రమాదకరం. దాదాపు 10 వేల కి.మీ వరకు అది ప్రభావం చూపుతుంది."
-ట్రెంట్​ పెన్హామ్​, వాతావరణ నిపుణులు

కారణం భారత్​లోనే...!

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఎన్నడూలేనంత స్థాయిలో విజృంభించడానికి భారత్​లోని వాతావరణ పరిస్థితులే కారణం అంటున్నారు నిపుణలు.

"భారత దేశంలో గత నెల నుంచి రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గడంలేదు. సాధారణంగా ఆసియాలో జూన్​, సెప్టెంబర్​లో రుతుపవనాలు తిరోగమనం చెంది దక్షిణానికి మళ్లుతాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అందుకే ఆస్ట్రేలియాలో వర్షాలు పడక వాతవరణం పొడిబారిపోయింది. ఇది మంటలు చెలరేగేందుకు సరైన స్థితి. "
-ట్రెంట్​ పెన్హామ్​​, వాతావరణ నిపుణులు

ఇదీ చదవండి:అయోధ్యలో రామమందిరానికై 27 ఏళ్లుగా ఉపవాసం!

Last Updated : Nov 11, 2019, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details