భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ను(covaxin latest news) ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ టీకా రెండు డోసులు తీసుకున్న విదేశీ ప్రయాణికులకు తమదేశంలో ప్రవేశించేందుకు అనుమతి ఉందని తెలిపింది. ఈమేరకు ఆస్ట్రేలియా ఔషధ, వైద్య పరికరాల నియంత్రణ సంస్థ- థెరపీటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్(TGA) అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రేలియా ఇప్పటికే అధికారికంగా గుర్తించింది.
కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రభావవంతమైన టీకాల అదనపు సమాచారాన్ని ఇటీవలే సేకరించింది టీజీఏ. ఈ వివరాలను పరిశీలించింన అనంతరం కొవాగ్జిన్(covaxin news), చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కరోనా వ్యాక్సిన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల వ్యాక్సిన్ స్టేటస్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో కొవాగ్జిన్ టీకా తీసుకున్న 12ఏళ్లు పైబడిన వారు, బీబీఐబీపీ టీకా తీసుకున్న 18-60 ఏళ్ల మధ్య వయస్సుల వారు ఆస్ట్రేలియా వెళ్లవచ్చు.
ఆ దేశాలు కూడా..