డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ రకం వైరస్ ధాటికి ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 633 కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరో ముగ్గురు చనిపోగా మరణాల సంఖ్య 60కి చేరింది.
లాక్డౌన్లో రాష్ట్రం..
కేసుల పెరుగుదల నేపథ్యంలో జూన్ 26 నుంచి సిడ్నీలో లాక్డౌన్ విధించగా, శనివారం నుంచి పూర్తి రాష్ట్రం నిర్బంధంలోకి వెళ్లింది.
టీకా ధ్రువపత్రం తప్పనిసరి..
డెల్టా ఉద్ధృతితో అమెరికాలో మంగళవారం ఒక్కరోజే 1,37,307 కేసులు వెలుగుచూశాయి. 873 మందికి పైగా మృతిచెందారు.
వైరస్‌ను అదుపు చేయడంలో భాగంగా ప్రజలు టీకా వేసుకునేలా ప్రోత్సాహించడానికి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. న్యూయార్క్‌లోని రెస్టారెంట్లు, మ్యూజియంలు, జిమ్‌లలోకి ప్రవేశించాలంటే కనీసం ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించడం తప్పనిసరి చేశారు.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,46,112 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,920 మంది ప్రాణాలు కోల్పోయారు.
కొత్త కేసులు ఇలా..
- బ్రెజిల్-38,218
- రష్యా-20,958
- ఫ్రాన్స్-28,114
- యూకే-26,852
- టర్కీ-21,692
- ఇరాన్-50,228
ఇదీ చూడండి:లాంగ్ కొవిడ్ సిండ్రోమ్‌కు కారణమేంటంటే?