కర్మాగారంలో ప్రమాదం- మెల్బోర్న్ ఉక్కిరిబిక్కిరి - అగ్నిమాపక సిబ్బంది
ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు నగరమంతా వ్యాపిస్తున్నాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మెల్బోర్న్లో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీ దగ్ధం
ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేయడానికి సుమారు 100 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వ్యర్థ పదార్థాల నిల్వలకు మంటలు అంటుకోవడం వల్ల పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి , పొగ నగరమంతా వ్యాపిస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా స్థానిక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.