వార్తల ప్రసారం కోసం దిగ్గజ సెర్చ్ఇంజన్ గూగుల్, సామాజిక మాధ్యమం ఫేస్బుక్... మీడియా సంస్థలకు పరిహారం చెల్లించడాన్ని తప్పనిసరి చేయనుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. కరోనా మహమ్మారి కారణంగా ప్రకటనల ద్వారా వచ్చే రాబడి తగ్గి... మీడియా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్(ఏసీసీసీ) జులై చివరలో విడుదల చేయనుంది. ఈ మేరకు ఆ దేశ కోశాధికారి జోష్ ఫ్రైడెన్‌బర్గ్ వెల్లడించారు.
ఆస్ట్రేలియా విజయం సాధిస్తుంది!