తెలంగాణ

telangana

By

Published : May 31, 2020, 5:03 PM IST

ETV Bharat / international

సమోసా దౌత్యం: మోదీ కోసం వంట చేసిన ప్రధాని

సాధారణంగా దేశ ప్రధానుల మధ్య సంభాషణ అంటే ఏ ద్వైపాక్షిక సంబంధాల గురించో లేక అభివృద్ధి పథకాల గురించో ఉంటుంది. లేదా కరోనా కాలం కనుక వైరస్​పై పోరాడాల్సిన వ్యూహాల గురంచి చర్చించుకుంటారు. కానీ ఆస్ట్రేలియా, భారత ప్రధానుల మధ్య జరిగిన సంభాషణ మాత్రం ఇందుకు భిన్నం. మరి వీరి మధ్య జరిగిన 'సమోసా దౌత్యం' విశేషాలు మీ కోసం..

Aus PM makes 'samosas', wishes to share with Modi
ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ 'సమోసాల' ముచ్చట!

జూన్​ 4న ఆస్ట్రేలియా, భారత ప్రధానుల మధ్య వీడియో సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి ముందు ఇద్దరు ప్రధానుల మధ్య ట్విట్టర్​లో ఆసక్తికర చర్చ జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​... మోదీ కోసం ఏకంగా సమోసాలు చేశారు. వాటితో కలిపి తినేందుకు మామిడి పచ్చడీ సిద్ధం చేశారు. ఆ వంటకాలతో దిగిన చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు మారిసన్.

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మోరిసన్​ ట్వీట్​

'భారత ప్రధాని ప్రజాదారణ కలిగిన గొప్ప నాయకుడు. ఆయన శాకాహారి. ఆయనతో కలసి నోరూరించే సమోసాలను ఆస్వాదించాలి అనుకున్నాను. కానీ మా సమావేశం వీడియో లింక్​ ద్వారా జరుగుతుంది.'

- స్కాట్​ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని​

మారిసన్​ ట్వీట్​కు ఆసక్తికరంగా బదులిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.

భారత ప్రధాని నరేంద్ర మోదీ రిట్వీట్​

'హిందు మహా సముద్రంతో అనుసంధానమైన భారత్​, ఆస్ట్రేలియా దేశాలు.. భారతీయ సమోసాలతో ఒక్కటయ్యాయి. కొవిడ్​-19 పై విజయం సాధించాక తప్పకుండా మీతో కలసి వీటిని తింటాను.'

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఇదీ చదవండి:పొగ రాయుళ్లలో 4 కోట్ల మంది 15 ఏళ్ల లోపువారే!

ABOUT THE AUTHOR

...view details