మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అధికార పార్టీ నేతలను దిగ్బంధించిన సైన్యం... తన చర్యలను సమర్థించుకునేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తోంది. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ అగ్రనేత, నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించడానికి కారణంగా చూపుతూ ఓ సరికొత్త కేసును తెరపైకి తీసుకొచ్చింది. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాకీటాకీలు కలిగి ఉన్నారని ఆమెపై కేసు బనాయించింది.
ప్రకృతి విపత్తు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారని మయన్మార్ అధ్యక్షుడు విన్ మింట్పైనా సైన్యం కేసు పెట్టింది. తద్వారా ఇద్దరు అగ్రనేతలను కనీసం ఫిబ్రవరి 15వరకు నిర్బంధంలోనే ఉంచేందుకు న్యాయపరంగా మార్గం సుగమం చేసుకుంది.