తెలంగాణ

telangana

ETV Bharat / international

గురుద్వారాపై దాడిని ఖండించిన ఎస్​జీపీసీ.. కమిటీ ఏర్పాటు - పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహెబ్​పై దాడి

సిక్కు పుణ్యక్షేత్రాలను పరిరక్షించే 'శిరోమణి గురుద్వారా పర్బంధక్​​ ' కమిటీ పాకిస్థాన్​లోని నన్​కానా సాహిబ్​పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఓ కమిటీని పాక్​కు పంపనుంది.

Attack on Nankana Sahib Gurdwara: SGPC to send 4-member delegation to Pak
పాక్​ గురుద్వారా దాడిపై నిపుణుల కమిటీ నియామకం

By

Published : Jan 4, 2020, 7:37 PM IST

పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహిబ్​పై జరిగిన దాడిని 'శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ' తీవ్రంగా ఖండించింది. అక్కడి వాస్తవిక పరిస్థితులు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నలుగురు సభ్యులతో కూడిన బృందం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ బృందం నన్​కానా సాహిబ్​ను సందర్శించి అక్కడి పరిస్థితులపై నివేదికను ఇవ్వనున్నట్లు ఎస్​జీపీసీ చీఫ్​ గోవింద్ సింగ్ లాంగోవాల్ తెలిపారు.

"పాకిస్థాన్​లోని గురుద్వారా నన్​కానా సాహిబ్​పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. అంతేకాకుండా అక్కడ నివసించే సిక్కులకు భద్రత కల్పించాలని పాక్​ సర్కార్​కు విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని పంపిస్తున్నాం".
-గోవింద్​ సింగ్​ లాంగోవాల్​, ఎస్​జీపీసీ చీఫ్​.

ఈ బృందం అక్కడి సిక్కుల కుటుంబాలను కలుసుకోనున్నట్లు సింగ్​ తెలిపారు. అంతేకాకుండా పాకిస్థాన్​లోని పంజాబ్​ గవర్నర్​, ముఖ్యమంత్రులతో సమావేశమవుతారని వెల్లడించారు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొని వెళ్లనున్నట్లు సింగ్​ స్పష్టం చేశారు.

భారత్​లోని పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్​ సింగ్ బాదల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాంతంలో శాంతి, సామరస్యాన్ని కలిగించేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:భద్రత లేని ఏటీఎం చోరీ.. 2 లక్షల నగదు మాయం!

ABOUT THE AUTHOR

...view details