తెలంగాణ

telangana

ETV Bharat / international

మా మంచి దొంగ.. మనసు దోచాడు - get

దొంగలకిీ మనసుంటుందని నిరూపించాడు చైనాకు చెందిన ఓ వ్యక్తి. ఏటిఎం​లో మహిళను బెదిరించి డబ్బును తస్కరించిన అతను... ఆ సొమ్మును ఆమెకే తిరిగిచ్చేసి అందిరి మనసు దోచేశాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఏటీఎమ్ దొంగ

By

Published : Mar 14, 2019, 6:10 AM IST

Updated : Mar 14, 2019, 7:00 AM IST

ఏటిఎమ్​లో డబ్బులు విత్​డ్రా చేస్తుంటే బెదిరించి సొమ్మును లాక్కునే దొంగల గురించి మీరు వినే ఉంటారు. కానీ వారికి మనసుంటుందని నిరూపించాడు చైనాకి చెందిన ఓ చోరుడు. దొంగిలించిన సొమ్ము తిరిగి వారికే ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

డబ్బుకోసం ఏటిఎమ్​కు వచ్చిన ఓ మహిళను బెదిరించి డబ్బు డిమాండ్ చేశాడో దొంగ. ఆమె భయపడి తన దగ్గర ఉన్న 2500 యువాన్లు(దాదాపు 26వేల రూపాయలు) దొంగకిచ్చేస్తుంది. మహిళ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోవడం గమనించిన దొంగ... మనసు మార్చుకుని డబ్బును తిరిగి ఆమెకి ఇచ్చేశాడు.

ఈ తతంగమంతా సీసీటీవీలో నమోదైంది. సొమ్ము తిరిగి ఇచ్చేటప్పుడు ఆమెవైపు చూసి చిరునవ్వి తన దారిన వెళ్లిపోయాడు.

Last Updated : Mar 14, 2019, 7:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details