నేపాల్‌లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా.. ఇప్పటివరకు ఆదేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 మంది మరణించారు. మరో 41 మంది ఆచూకీ గల్లంతైంది. నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల.. వరదనీరు ఉద్ధృతంగా ప్రవహించడమే కాకుండా, కొండచరియలు విరిగిపడుతున్నాయి.
నేపాల్‌లో వాన బీభత్సం .. 60మంది మృతి - నేపాల్‌లో భారీ ప్రమాదం
నేపాల్‌లో నాలుగు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరద కారణంగా కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 60 మంది చనిపోగా.. 41 మంది గల్లంతయ్యారు.
నేపాల్ వర్ష బీభత్సం... 60 మంది మృతి
పశ్చిమ నేపాల్‌లోని మయాగ్డి జిల్లాలోనే వరద బీభత్సానికి 27 మంది మరణించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరిలిస్తున్నారు.
ఇదీ చదవండి:మార్స్ యాత్రకు కౌంట్‌డౌన్- రోవర్ విశేషాలు తెలుసా?