పాకిస్థాన్ వైపు నుంచి విరామం లేకుండా రాకెట్లు దూసుకొచ్చాయని అఫ్గానిస్థాన్ పేర్కొంది. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 50 రాకెట్ దాడులు జరిగినట్లు కునార్ రాష్ట్ర గవర్నర్ మహ్మద్ ఇక్బాల్ సయిద్ వెల్లడించారు. ఈ రాకెట్లు.. రాష్ట్రంలోని షెల్టాన్ జిల్లాలో ల్యాండ్ అవడం వల్ల స్థానికుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఇక్బాల్ తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
అఫ్గాన్‌పై పాక్ అవిరామ రాకెట్ దాడులు! - మహ్మద్ ఇక్బాల్ సయిద్
పాకిస్థాన్ భూభాగం నుంచి 50 రాకెట్లు దూసుకొచ్చాయని అఫ్గానిస్థాన్ వెల్లడించింది. ఈ దాడుల వల్ల స్థానికుల ఆస్తులకు నష్టం జరిగినట్లు గవర్నర్ తెలిపినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
అఫ్గాన్‌పై పాక్ అవిరామ రాకెట్ దాడులు!
ఇరు దేశాల మధ్య 2,400కిలోమీటర్ల డ్యూరండ్ సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దు ప్రాంతంలోని కొన్ని గ్రామాలు రెండు దేశాల భూభాగాల్లోనూ ఉంటాయి. దీంతో ఇరు దేశాలు తరుచూ ఒకరిపైఒకరు ఆరోపణలు చేసుకుంటారని ఓ వార్తా పేర్కొంది.
ఇదీ చూడండి:అమెరికాలో కాల్పులు- ఐదుగురు చిన్నారులు మృతి