పాకిస్థాన్ కరాచీ విశ్వవిద్యాలయం మస్కాన్కు ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన పేలుడులో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇందులో 15మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పై సింధ్ ముఖ్యమంత్రి స్పందించారు. పేలుడుకు గల కారణాలపై నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.
పోలీసులు మాత్రం ఇది కేవలం సిలిండర్ పేలుడుగా అంచనాకు వేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విచారణలో తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ పేలుడుతో సమీప భవనాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పేలుడు ఏ విధంగా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.