కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద(Kabul Airport) ఐసిస్-కె పన్నినకుట్రనుఅమెరికా ఆదివారం భగ్నం చేసింది. ముష్కరుల వాహనంపై డ్రోన్ దాడి జరిపింది. అయితే.. ఈ దాడిలో చిన్నారులు సహా 10 మంది మృతి చెందారని స్థానికులు చెప్పినట్లుగా అఫ్గాన్ వార్తా సంస్థ టోలో న్యూస్ తెలిపింది.
US Drone Attack: 'అమెరికా డ్రోన్ దాడుల్లో 10 మంది అఫ్గానీలు మృతి' - were killed in a US airstrike in Kabul yesterday
ఉగ్రకుట్రను భగ్నం చేసేందుకు అమెరికా జరిపిన దాడి(US Drone Attack) కొంతమంది అఫ్గాన్ పౌరులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అమెరికా జరిపిన దాడుల కారణంగా పది మంది మరణించారని టోలో న్యూస్ తెలిపింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పింది.
అమెరికా డ్రోన్ దాడి
కాబుల్ విమానాశ్రయం వద్ద గత గురువారం నరమేధానికి పాల్పడ్డ ఐఎస్‌ఐఎస్-కె ఉగ్ర సంస్థ ఆదివారం మరోసారి అలాంటి దాడికి వ్యూహరచన చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ ఆదివారం తెలిపారు. ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని తాము గుర్తించామన్నారు. డ్రోన్ దాడి ద్వారా వారిని హతమార్చామని చెప్పారు. డ్రోన్ దాడి అనంతరం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని.. వాహనం నిండా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తద్వారా స్పష్టమవుతోందని వివరించారు.