తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆరు నెలల తర్వాత భూమి మీద కాలుమోపారు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం​లో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాముల బృందం భూమికి చేరుకుంది. ఖజకిస్థాన్​లో మంగళవారం భూమిపైన కాలుమోపింది.

భూమిపై కాలుమోపిన వ్యోమగాములు

By

Published : Jun 25, 2019, 3:00 PM IST

భూమిపై కాలుమోపిన వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం​(ఐఎస్​ఎస్)లో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం గడిపిన ముగ్గురు వ్యోమగాములు మంగళవారం భూమి మీద కాలు మోపారు. రష్యాకు చెందిన కమాండర్​ సీనియర్​ ఆస్ట్రోనాట్ ఓలెగ్​ కోనోనెన్కో నేతృత్వంలో.. ఐఎస్​ఎస్​​లో గడిపిన అమెరికాకు చెందిన అన్నె​ మెక్​క్లయిన్​, కెనడాకు చెందిన డేవిస్​ సెయింట్​ జాక్వెస్​... షెడ్యూల్​ కంటే ఒక నిమిషం ముందుగా ఖజకిస్థాన్​లో దిగారు.

భూమి మీద కాలుమోపాక కోనోనెన్కో కాస్త నీరసంగా కనపడ్డారు. మిగతా ఇద్దరు ఉత్సాహంగా అభివాదం చేస్తూ దిగారు. అనంతరం వీరిని ఎండకు కూర్చోబెట్టి ఆహారం అందించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి : రెండు యుద్ధ విమానాలు ఢీ... ఓ పైలట్​ మృతి

ABOUT THE AUTHOR

...view details