మూడు రోజుల కీలక పర్యటనలో భాగంగా నేపాల్ చేరుకున్నారు భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే. నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నరవాణేకు... ఆ దేశ చీఫ్ జనరల్ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ ప్రభు రామ్ ఘనస్వాగతం పలికారు.
నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం నేపాలీ ఆర్మీ స్టాఫ్ కళాశాలలో యువ సైనికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపా నిర్వహించనున్న గౌరవ విందు స్వీకరించనున్నారు నరవాణే