అఫ్గానిస్థాన్‌లో ఓ టీవీ యాంకర్‌ను లైవ్‌లో బెదిరించారు సాయుధ తాలిబన్లు(Afghan Taliban). అతని వెనకాల నిల్చుని తుపాకులు ఎక్కుపెట్టి తమను ప్రశంసించాలని బలవంతపెట్టారు. యాంకర్‌ను భయపడొద్దని చెప్పి మరీ పొగిడించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీడియా స్వేచ్ఛకు విఘాతం కల్గించమని తాలిబన్లు(Taliban News) ఇచ్చిన హామీ ఏమైందని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వీడియోను ఇరానీ జర్నలిస్ట్ మసీ అలినెజాద్ ట్విట్టర్లో షేర్ చేశారు.
'ఇది అరాచకం, టీవీ యాంకర్‌ను బెదిరించి ఇస్లామిక్ ఎమిరేట్ పాలనలో అఫ్గానీలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబన్ ఉగ్రవాదులు ఎలా చెప్పిస్తున్నారో చూడండి. తాలిబన్ అంటేనే భయానికి మారు పేరని లక్షలాది మంది మనస్సులో ఉంది. అందుకు ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం' అని పేర్కొన్నారు మసీ అలినెజాద్.
ఆగస్టు 15న అఫ్గాన్‌ను(Afghan Crisis) తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. కాబుల్‌లో(Kabul News) వారి కోసం ప్రతి ఇల్లు తిరిగి సోదాలు నిర్వహిస్తున్నారు. బంధువులు దొరికినా దాడులకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం టోలో న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్‌ను చితకబాదారు. జర్మనీ వార్తా సంస్థకు చెందిన ఓ రిపోర్టర్ బంధువును దారుణంగా హత్య చేశారు.
ఇదీ చూడండి:Afghan Crisis: పెనం పై నుంచి పొయ్యిలోకి..