తెలంగాణ

telangana

ETV Bharat / international

అర్జెంటీనాలో 10లక్షలు దాటిన కరోనా కేసులు - World cases

ప్రపంచంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అర్జెంటీనాలో మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. మరోవైపు అమెరికా, బ్రెజిల్​, రష్యా సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Argentina is 6th nation to pass 1 million coronavirus cases
అర్జెంటీనాలో 10లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Oct 20, 2020, 9:43 AM IST

కరోనా ధాటికి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 64 లక్షల 8వేలు దాటింది. కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 11 లక్షల 23 వేలకు చేరువైంది.

అమెరికాలో ఇటీవలే రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు కనిపించినా.. తాజాగా మళ్లీ పెరిగింది. కొత్తగా 57 వేల 327 కేసులు నమోదవగా.. 442మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 84 లక్షల 56 వేలు దాటింది.

అర్జెంటీనాలో 10లక్షలు...

అర్జెంటీనాలో కొత్తగా నమోదైన 12,214 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 10 లక్షలు దాటింది. దీంతో పది లక్షల కేసులు దాటిన ఆరో దేశంగా అర్జెంటీనా నిలిచింది. తాజాగా మరో 449 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • బ్రిటన్​లో తాజాగా 18,804 మందికి కరోనా సోకింది. 80 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో ఒక్కరోజే 15,783 కేసులు వెలుగుచూశాయి. మరో 321 మంది చనిపోయారు.
  • రష్యాలో తాజాగా 15,982 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 179 మృతిచెందారు.
  • కరోనా కేసుల్లో ఐదో స్థానంలో ఉన్న స్పెయిన్​లో ఒక్కరోజే 12,214 కేసులు నమోదవగా.. 73మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 13,243 మంది కొవిడ్​ బాధితులుగా మారగా.. 146మంది మృతిచెందారు.
  • ఇటలీలో తాజాగా 9,338 మందికి పాజిటివ్​ తేలగా.. 73 మంది మరణించారు.
  • ఇరాన్​లో కొవిడ్ మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 337మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు. మరో 4,251 కేసులు నమోదయ్యాయి.
  • దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి డాక్టర్​ జ్వేలి మైఖ్​జీకి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.
  • స్విట్జర్లాండ్​ సైన్యాధ్యక్షుడు థామస్​ సుస్లీ కరోనా బారినపడ్డారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి:ఫౌచీ మాటలు విని ప్రజలు విసిగిపోయారు: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details