ఒక్కసారి ప్రేమగా పలకరిస్తే చాలు... మనుషులను మనుషలకంటే ఎక్కువగా ప్రేమించేస్తాయి శునకాలు. అందుకే, మానవాళి ఎప్పుడో శునకాల ప్రేమకు దాసోహమైపోయింది. సామాజిక మాధ్యమాల్లో శునకాల వీడియోలకు వచ్చే లైకులే ఇందుకు నిదర్శనం. పైగా ముద్దొచ్చే జంతువుల వీడియోలు చూడడం వల్ల ఎంతటి ఒత్తిడైనా ఇట్టే దూరమవుతుందని పరిశోధనల్లో తేలింది. అందుకే, ఓ ఏడు శునకాలు ఇన్స్టాలో తెగ సందడి చేస్తున్నాయి.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, సెలబ్రిటీలుగా మారిపోయాయి. ఆ సెలబ్రిటీ కుక్కలివే...
- రికార్డుల పుట్ట.. జిఫ్
ముద్దు ముద్దు హావభావాలతో... వీక్షకుల మదిని దోచిన జిఫ్కు దాదాపు కోటికి పైగా ఫాలోవర్లున్నారు. అన్ని శునకాల్లా నాలుగు పాదాలపై కాకుండా.. కేవలం రెండు కాళ్లతో చకచకా చెప్పిన పని చేయడం జిఫ్ ప్రత్యేకత. పోమెరానియన్ జాతికి చెందిన జిఫ్ తన అందం, ప్రతిభతో ఇప్పటికే రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు తన ఖాతాలో వేసుకుంది.
- నిజాయితీ గల టక్కర్
గోల్డెన్ రిట్రీవర్ టక్కర్ వినయం, విధేయత మాత్రమే కాదు.. టన్నుల కొద్దీ నిజాయితీ, హుందాతనానికి మారుపేరు. 25 లక్షల మంది ఫాలోవర్లున్న టక్కర్.. తన ముందు ఆహారం పెట్టి ముట్టుకోవద్దంటే.. యజమాని మాటకు విలువిచ్చి ఎంత నోరూరినా నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోదు. అందుకే, సామాజిక మాధ్యమాల్లో టక్కర్ పేరు మారుమోగుతోంది.
- మాయ మహా తెలివైందే!
పోలార్ బేర్ సంతతికి చెందిన మాయ ఎంతో తెలివైంది. తన మేధస్సుతో 20 లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది.
- మారుతో.. నవ్వుతో పడేసింది!
జపాన్ టోక్యోకు చెందిన మారుతో నవ్వు ముఖాన్ని చూస్తే సగం బాధలు తీరిపోయిన భావన కలుగుతుంది. 2011లో జపాన్లో సంభవించిన భీకర భూకంపం తర్వాత.. ఆ దేశంలో జనం బిక్కుబిక్కుమంటున్న సమయంలో యజమాని షింజ్రో ఓనో.. మారుతో ప్రశాంతమైన ముఖాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టాడు. ఇప్పుడు ఇన్స్టాలో దాదాపు 26 లక్షల మంది... షిబ ఇనూ జాతికి చెందిన మారుతో చిరునవ్వును రోజూ చూస్తున్నారు.
- అల్లరి చార్లీ