రెండురోజుల పర్యటనలో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత్తో చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. 2018లో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్తో చర్చలకు ప్రయత్నించినట్లు వివరించారు.
''నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పొరుగున ఉన్న భారతదేశాన్ని సంప్రదించా. ఉపఖండంలోని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీకి వివరించా.''
-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని
చర్చల విషయంలో తాను విజయవంతం కాలేదని ఇమ్రాన్ వెల్లడించారు. అయితే ఎప్పటికైనా విజయం సాధిస్తాననే ఆశాభావంతో ఉన్నానని తెలిపారు.