తెలంగాణ

telangana

ETV Bharat / international

నేడు శ్రీలంకలో జాతీయ సంతాప దినం - SRILANKA

ఆదివారం వరుస బాంబు పేలుళ్ల మారణహోమానికి బలైన దాదాపు 300 మందికి నివాళిగా నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం.

నేడు శ్రీలంకలో జాతీయ సంతాప దినం

By

Published : Apr 23, 2019, 7:43 AM IST

Updated : Apr 23, 2019, 8:13 AM IST

నేడు లంకలో జాతీయ సంతాప దినం

వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన దాదాపు 300 మందికి నివాళిగా మంగళవారాన్ని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం.

మారణహోమం ధాటికి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఏ క్షణాన ఎక్కడ పేలుడు జరుగుతుందోని తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

పేలుళ్లలో అంతర్జాతీయ సంస్థల ప్రమేయం ఉందని భావిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 24 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. దాడుల్లో ఏడుగురు అత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారని శ్రీలంక మంత్రి సేనరత్నే ప్రకటించారు. దాడులకు పాల్పడింది నేషనల్​ తవ్​హీద్​ జమాత్​ సంస్థ అని వెల్లడించారు.

ఇదీ చూడండి: లంకలో అత్యయిక స్థితి.. సైన్యానికి విస్తృతాధికారాలు

Last Updated : Apr 23, 2019, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details