పాకిస్థాన్ స్వాట్ జిల్లా సమీపంలోని కొండ ప్రాంతంలో 1300 ఏళ్ల క్రితం నాటి హిందూ దేవాలయం బయటపడింది. బరీకోట్ గుండాయ్లో... పాకిస్థాన్, ఇటలీ పురావస్తు శాఖ నిపుణులు జరిపిన తవ్వకాల్లో ఈ ఆలయం వెలుగుచూసింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా పురావస్తు శాఖ విభాగానికి చెందిన ఫజ్లే ఖాలిక్ ... తవ్వకాల్లో బయటపడింది విష్ణు దేవాలయం అని స్పష్టం చేశారు. ఈ ఆలయాన్ని హిందూ షాహి పరిపాలనా కాలంలో నిర్మించినట్లు పేర్కొన్నారు. స్వాట్ జిల్లా పురాతన కట్టడాలకు నిలయమని ఈ సందర్భంగా తెలిపారు.
ఇంకా ఎన్నో..!