తెలంగాణ

telangana

ETV Bharat / international

నోరు జారారు.. గుడ్డు పగిలింది..! - గుడ్డు దాడి

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఆస్ట్రేలియన్​ సెనేటర్​ తలపై గుడ్డు పగులగొట్టాడు ఓ పదిహేడేళ్ల యువకుడు. న్యూజిలాండ్​లో దారుణ మారణకాండ ఘటన విషయంలో ఓ వర్గంపై సెనేటర్ ఫ్రసెర్​ అన్నింగ్​ ​ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి చేశాడు.

నోరు జారారు.. గుడ్డు పగిలింది

By

Published : Mar 16, 2019, 4:45 PM IST

ఆస్ట్రేలియన్​ స్వతంత్ర సెనేటర్ ఫ్రసెర్ అన్నింగ్​పై ఓ యువకుడు గుడ్డుతో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే కెమెరాలో వీడియో తీస్తూ ఫ్రసెర్​ తలపై గుడ్డు పగలగొట్టాడు. ఊహించని చర్యతో కోపోద్రిక్తులైన సెనేటర్​ యవకుడిపై చేయి చేసుకున్నారు. అక్కడున్న వారిలో కొంత మంది యువకుడిపై దాడి చేసి ఒళ్లు హూనం చేశారు.

ఆస్ట్రేలియన్​ సెనేటర్​పై యువకుడు గుడ్డుతో దాడి చేశాడు

న్యూజిలాండ్​లోని మసీదుల్లో జరిగిన కాల్పుల ఘటనకు ముస్లిం వలసలే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఫ్రసెర్​.

ఫ్రసెర్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు సిగ్గుపడాలంటూ ఘాటుగా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details