అది 2008. అఫ్గానిస్థాన్. నాటి సెనేటర్ జో బైడెన్(biden news), మరో ఇద్దరితో కలిసి అఫ్గాన్ పర్యటనలో ఉన్న సమయం. రెండు హెలికాప్టర్లలో బైడెన్ బృందం ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. అత్యవసరంగా హెలికాప్టర్లను ఓ లోయలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. బయట తుపాను, లోపల ఆందోళన. ఎక్కడ ఉన్నారన్న విషయం కూడా తెలియదు.
ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి అమెరికా భద్రతా దళానికి సమాచారం అందింది. భద్రతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హెలికాప్టర్ ఉన్న ప్రాంతానికి వెళ్లడం, ఆ పరిస్థితుల్లో కాస్త ప్రమాదకరం. కొండలు ఎక్కి, దిగి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మహమ్మద్ అనే అనువాదకుడు అగ్రరాజ్య భద్రతా దళానికి సహాయం చేశాడు. బైడెన్ విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. భద్రతా దళాలకు మార్గనిర్దేశం చేస్తూ బైడెన్(biden afghanistan news) వద్దకు తీసుకెళ్లాడు.
మహమ్మద్ శ్రమకు గతంలో గుర్తింపు లభించింది. ఎందరో అధికారులు ఆయన్ని ప్రశంసించారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం మహమ్మద్ కుటుంబం బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. గతంలో అమెరికాకు తాను సాయం చేయడం వల్ల ఇప్పుడు తాలిబన్లు తనను చంపేస్తారని మహమ్మద్ భయపడుతున్నాడు. భార్య, నలుగురు పిల్లలతో తాను తాలిబన్ల నుంచి తప్పించుకుని జీవిస్తున్నట్టు పేర్కొన్నాడు(afghan interpreters left behind).
"హలో ప్రెసిండెంట్. నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి," అని మహమ్మద్ వేడుకుంటున్నాడు. కాగా.. అమెరికా తరలింపు ప్రక్రియ ఆగస్టు 31తో ముగియడం వల్ల మహమ్మద్ ఆశలు సన్నగిల్లాయి.
అయితే ఈ వ్యవహారంపై శ్వేతసౌధం మంగళవారం స్పందించింది. ఎలాగైనా మహమ్మద్‌ను రక్షిస్తామని హామీనిచ్చింది.
"20ఏళ్ల పాటు అమెరికా తరఫున పోరాడినందుకు ధన్యవాదాలు. ఆ రోజు మంచు తుపాను నుంచి బైడెన్‌ను రక్షించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము బయటకు తీసుకొస్తాము. మీ సేవకు గౌరవం దక్కుతుంది. ఎలాగైనా మిమ్మల్ని బయటకు తీసుకొస్తాము," అని ప్రెస్ కార్యదర్శి జెన్ సాకి వెల్లడించారు.
ఆగస్టు 15న కాబుల్‌ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు(taliban latest news). అప్పటి నుంచి ఆగస్టు 31 వరకు పౌరులు, భద్రతాధికారులు, సైనికులు తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగింది. అప్గాన్ పౌరులు కూడా దేశాన్ని వీడేందుకు కాబుల్ విమానాశ్రయానికి ఎగబడ్డారు. ఈ క్రమంలో అనేకమార్లు తొక్కిసలాటలు జరిగాయి. రద్దీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఐసిస్ కే ఉగ్రసంస్థ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 180కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు అమెరికా సైనికులున్నారు. ఇందుకు ప్రతీకారంగా ఐసిస్ కే స్థావరాలపై మెరుపుదాడులు చేసింది అగ్రరాజ్యం. ఇంతటి ఉద్రిక్త వాతావరణం మధ్య ఆగస్టు 31తో తరలింపు ప్రక్రియ ముగిసినట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అగ్రరాజ్య చరిత్రలో ఇదే అత్యంత క్లిష్టమైన మిషన్‌గా అభివర్ణించారు.
ఇదీ చూడండి:-తాలిబన్ల మెరుపు వేగానికి బైడెన్ షాక్!