తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​తో చర్చలు అంటూనే చైనా దూకుడు! - Sino-India border

భారత్​తో చర్చలు జరుపుతామంటూనే చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. శనివారం ఇరుదేశాల సైనికాధికారుల భేటీకి ముందు సరిహద్దులోని పశ్చిమ కమాండ్​కు కొత్త సారథిని నియమించింది.

China appoints new commander
భారత్​తో చర్చలు అంటూనే చైనా దూకుడు!

By

Published : Jun 5, 2020, 6:12 PM IST

ఓ వైపు భారత్​తో సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్న తరుణంలో చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. సరిహద్దు​లోని వెస్టర్న్​ థియేటర్​ కమాండ్​ బలగాలకు కొత్త కమాండర్​ను నియమించింది. నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు శనివారం(జూన్​ 6న) ఇరు దేశాల సైనికాధికారుల మధ్య భేటీకి ముందు ఈ చర్య.. చర్చనీయాంశంగా మారింది.

లెఫ్టినెంట్​ జనరల్​ జు క్విలింగ్​ను కొత్త కమాండర్​గా నియమించినట్లు పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) తన అధికారిక వెబ్​సైట్​ ద్వారా తెలియజేసింది.

ఈ కమాండ్​ వాస్తవాధీన రేఖకు సుమారు 3,488 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జనరల్​ జావో జోంగ్కి నాయకత్వం వహించే ఈ కమాండ్​లో సైన్యం, వైమానిక దళాలు ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details