తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు వ్యోమగాములను పంపిన రష్యా - అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను విజయవంతంగా పంపించింది రష్యా. వారిలో ఒకరు అమెరికా, ఇద్దరు రష్యా నుంచి ఉన్నట్లు తెలిపింది.

American, Russians dock at International Space Station
ఐఎస్‌ఎస్‌కు ముగ్గురు వ్యోమగాములను పంపిన రష్యా

By

Published : Apr 9, 2021, 10:26 PM IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో పనిచేసేందుకు వ్యోమగాములతో కూడిన రాకెట్​ను రష్యా విజయవంతంగా ప్రయోగించింది. ఈమేరకు కజకిస్థాన్​లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి సోయుజ్ ఎంఎస్-18 అంతరిక్ష నౌకలో ముగ్గురు వ్యోమగాములను పంపినట్లు రష్యా పేర్కొంది.

వారిలో ఇద్దరు రష్యా వ్యోమగాములతో పాటు ఒకరు నాసా వ్యోమగామి ఉన్నట్లు తెలిపింది. బయోలజీ, బయోటెక్నాలజీ, భౌతిక శాస్త్రం, ఎర్త్​ సైన్సెస్​లలో వారు పరిశోధనలు చేయనున్నారు.

ఇదీ చూడండి:బంగాల్​ దంగల్​: నాలుగో దశకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details