తెలంగాణ

telangana

ETV Bharat / international

3 నెలల తర్వాత అజ్ఞాతం వీడిన జాక్ మా - జాక్​ మా లేటెస్ట్ న్యూస్

చైనా బిలియనీర్​ జాక్​ మా దాదాపు మూడు నెలల తర్వాత అజ్ఞాతం వీడారు. ఆ దేశ విధానాలను ఎండగట్టి.. కమ్యూనిస్టు ప్రభుత్వ ఆగ్రహానికి గురైన జాక్​ మా.. కొన్నాళ్లుగా బహిరంగంగా కనిపించలేదు. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆయన కనిపించడం అనుమానాలకు తెరదించినట్లైంది.

Alibaba's Jack Ma resurfaces
జాక్​ మా కనపించారు

By

Published : Jan 20, 2021, 12:28 PM IST

Updated : Jan 20, 2021, 5:23 PM IST

చైనాకు చెందిన అలీబాబా, యాంట్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్​ మా అజ్ఞాతం వీడారు. చైనా ప్రభుత్వాన్ని విమర్శించి వివాదాల్లో చిక్కుకున్న జాక్​.. దాదాపు మూడు నెలల తర్వాత బహిరంగంగా కనిపించారు. ఈ మూడు నెలలు ఆయన కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ సాగింది.

ఎక్కడ కనిపించారు?

గ్రామీణ ఉపాధ్యాయుల కృషి, విజయాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఓ ఆన్​లైన్​ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్​లో ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు జాక్​ మా. ప్రతి ఏటా ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా జరగుతుండగా.. కొవిడ్ నేపథ్యంలో ఈ సారి ఆన్​లైన్​లో జరిగింది.

అసలు వివాదం ఏమిటంటే..

2020 అక్టోబర్‌ 24న చైనాలో జరిగిన ది బండ్‌ సమిట్‌లో జాక్‌మా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి చైనాకు చెందిన దిగ్గజ బ్యాంకర్లు కూడా హాజరయ్యారు. జాక్‌మా తన ప్రసంగంలో చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు. ఈ విషయమై జాక్ మాపై చైనా ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఆయన సంస్థలపై నిఘా కూడా పెట్టింది. ఇదే కారణంతో జాక్ మాకు చెందిన యాంట్ గ్రూప్ ఐపీఓను అడ్డుకుంది. ఇందుకు చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్ స్వయంగా రంగంలోకి దిగినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. జాక్ మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో కూడా చైనా ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల పలు వార్తలొచ్చాయి.

జాక్ మా ప్రసంగం తర్వాత దాదాపు మూడు నెలల నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఏ కార్యక్రమంలోనూ ఆయన కనిపించలేదు. జాక్​ మాతో చైనా ప్రభుత్వం వివాదం తర్వాత.. వెంటవెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనితో అంతర్జాతీయంగా కొన్నాళ్లుగా తీవ్ర చర్చ జరుగుతోంది. జాక్​ మా ఆజ్ఞాతం వీడిన నేపథ్యంలో మిగతా విషయాలపైన కుడా ఏమైనా స్పష్టత వస్తుందేమో వేచి చూడాలి.

ఇవీ చూడండి:

Last Updated : Jan 20, 2021, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details